సిరీస్ ఎవరిదో తేలిపోయేది నేడే
నేడు భారత్ - ఆస్ట్రేలియా మూడవ టీ 20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సిరీస్ ఎవరిదో తేల్చనుంది.;
నేడు భారత్ - ఆస్ట్రేలియా మూడవ టీ 20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సిరీస్ ఎవరిదో తేల్చనుంది. అందుకే ఇరు జట్లు శక్తి మేరకు పోరాడనున్నాయి. సొంత గడ్డ మీద ఆస్ట్రేలియాపై సిరీస్ దక్కించుకోవాలన్న కసితో భారత్ ఉంది. ప్రపంచ కప్ కు ముందు సిరీస్ ను కైవసం చేసుకుని మానసికంగా దెబ్బతీయాలన్నది ఆస్ట్రేలియా ఆలోచనగా ఉంది. ఈ సిరీస్ ఎవరన్నది నిర్ణయించేది ఈరోజు జరిగే వన్డే కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇరు జట్లు బలంగా...
మొహాలీలో అత్యధికంగా 209 పరుగులు చేసినా దానిని ఛేజింగ్ చేయడంలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అలాగే నాగపూర్ లో జరిగిన ఎనిమిది ఓవర్ల మ్యాచ్ లో ఆస్ట్రేలియా 90 పరుగులను ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. దీంతో బౌలింగ్, బ్యాటింగ్ లో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. సమజట్లు తలపడేటప్పుడు చూసే వారికి ఆ కిక్కే వేరుగా ఉంటుంది. సిరీస్ సాధించుకుంటే ప్రపంచకప్ ముందు భారత్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.