India Vs Australia T20 : టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఫస్ట్ బ్యాటింగ్ ఇండియానే

భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడో టీ 20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.;

Update: 2023-11-28 13:05 GMT
india, asustralia, third t20, guwahati, cricket match
  • whatsapp icon

భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడో టీ 20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. తిరువనంతపురం తరహాలో ఎక్కువ పరుగులు చేసి ఆసీస్ బౌలర్లపై టీం ఇండియా వత్తిడి తేవాల్సి ఉంటుంది. బౌలర్లపై వత్తిడి పడకుండా ఉండాలంటే భారీ స్కోరు చేసి ఆస్ట్రేలియాను నిలువరించే వీలుంది.

రెండు గెలిచి...
ఐదు మ్యాచ్ ల సిరీస్ లలో ఇప్పటికే రెండు మ్యాచ్ లలో గెలిచిన ఊపు మీదున్న టీం ఇండియా మూడో మ్యాచ్ ను కూడా గెలిచి సిరీస్ ను ముందుగానే తమ ఖాతా వేసుకోవాలని భావిస్తుంది. ఆస్ట్రేలియా మాత్రం ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ఉవ్విళ్లూరుతుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ దక్కించుకున్నట్లే. అందుకే ఆసీస్ ఈ మ్యాచ్ లో సర్వశక్తులను ఒడ్డి గెలుపు కోసం ప్రయత్నిస్తుంది.


Tags:    

Similar News