నేడు భారత్ - ఆస్ట్రేలియా మూడో టెస్ట్
భారత్ - ఆస్ట్రేలియా మూడో టెస్ట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది;
భారత్ - ఆస్ట్రేలియా మూడో టెస్ట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే రెండు జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే సిరీస్ సొంతమవుతుంది. 2-0 ఆధిక్యతతో భారత్ కొనసాగుతుంది. ఈరోజు ఇండోర్ లో మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ లోనూ...
నాగపూర్, ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లలో స్పిన్నర్లే భారత్ కు విజయం సాధించి పెట్టారు. స్పిన్నర్లకు అనుకూలంగా పిచ్ లు ఉండటంతో భారత్ స్పిన్నర్లు జడేజా, అశ్విన్ లు అత్యధిక వికెట్లు సాధించారు. గత రెండు మ్యాచ్ లలో స్పిన్నర్లే బ్యాటర్లుగా మారి భారత్ కు విజయాన్ని సాధించి పెట్టారు. ఈ సారి కూడా స్పిన్నర్లకు అనుకూలంగానే పిచ్ ఉందని చెబుతున్నారు. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లోనైనా గెలిచి తమ సత్తా నిరూపించుకోవాలనుకుంటుంది. భారత్ సిరీస్ ను కైవసం చేసుకోవడానికి ఈ మ్యాచ్ లో గెలిచి టెస్ట్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుంది. మొత్తం మీద తొలుత బ్యాటింగ్ కు దిగుతున్న భారత్ ఎన్ని పరుగులు చేస్తుందన్నది చూడాల్సి ఉంది.