నేడు క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ కోసం ఆఫ్ లైన్ లో టిక్కెట్లను నేడు విక్రయించనుంది;

Update: 2022-09-22 02:18 GMT

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ కోసం ఆఫ్ లైన్ లో టిక్కెట్లను నేడు విక్రయించనుంది. ఈ నెల 25వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి పేటీఏం ఇన్‌సైడర్ యాప్ ద్వారా ఆన్‌లైన్ లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అందుబాటులోకి తెచ్చింది. అయితే ఆన్‌లైన్ లో ఉంచిన కొద్దిసేపటికే ఇవి అమ్ముడు పోయాయి. ఆఫ్‌లైన్ లో విక్రయించాలని గత రెండుమూడు రోజులుగా క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్ వద్ద వేచి చూస్తున్నారు.

నేటి నుంచి...
ఆందోళనకు కూడా దిగారు. క్రికెట్ అభిమానుల డిమాండ్ మేరకు పేటీఎం ఇన్‌సైడర్ తో చర్చలు జరిపిన హైదరాాద్ క్రికెట్ అసోసియేషన్ కొన్ని టిక్కెట్లను నేరుగా కౌంటర్ లో అమ్మాలని నిర్ణయించింది. ఈరోజు జింఖానా గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం జరుగుతుంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్ లో ఈ టిక్కెట్లను విక్రయించనున్నారు.


Tags:    

Similar News