నేడు భారత్ - ఆస్ట్రేలియా తొలి టీ 20
నేడు భారత్ - ఆస్ట్రేలియా మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరుగుతుంది.;
నేడు భారత్ - ఆస్ట్రేలియా మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరుగుతుంది. మొత్తం మూడు టీ 20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈరోజు మొహాలీ వేదికగా మ్యాచ్ జరుగుతుంది. రెండో టీ 20 మ్యాచ్ నాగపూర్ లోనూ, మూడో మ్యాచ్ హైదరాబాద్ లోనూ జరగనుంది. ప్రపంచ కప్ కు ముందు జరిగే ఈ మ్యాచ్ లు ఇరు జట్లు తమ సాధన కోసమే కాకుండా ప్రయోగాలకు కూడా అవకాశం లభించనుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
పొరపాట్లను సరిదిద్దుకునేందుకు...
ఆసియా కప్ లో జరిగిన పొరపాట్లు ఈ మ్యాచ్ లో భారత్ సరిదిద్దుకునేందుకు ఛాన్స్ లభిస్తుంది. ఆటగాళ్లను బరిలోకి దించడంలో కాని, బౌలింగ్, బ్యాటింగ్ లో చేయాల్సిన మార్పులపై ఆలోచించుకునే అవకాశం ఈ టీ 20 మ్యాచ్ ల ద్వారా లభించనుంది. గాయం తర్వాత జస్పిత్ బూమ్రా ఈ మ్యాచ్ లో ఆడనున్నారు. హర్షల్ పటేల్ కూడా జట్టులో చేరే అవకాశం ఉంది. దీంతో ఈ మూడు మ్యాచ్ లు రసవత్తరంగా సాగనున్నాయి.