టీం ఇండియా టెస్ట్ కెప్టెన్సీకి కొహ్లీ గుడ్ బై

టీం ఇండియా టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కొహ్లి గుడ్ బై చెప్పారు. ఆయన ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు.;

Update: 2022-01-15 13:39 GMT

టీం ఇండియా టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కొహ్లి గుడ్ బై చెప్పారు. ఆయన ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. సౌతాఫ్రికాలో జరిగిన మూడు టెస్ట్ సిరీస్ లో భారత్ ఓటమి పాలయింది. 2-1 ఆధిక్యంతో సౌతాఫ్రికా విజయం సాధించింది. అయితే ఈ ఓటమితో సంబంధం లేకపోయినా విరాట్ కొహ్లి టీం ఇండియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

ఇప్పటికే....
ఇప్పటికే విరాట్ కొహ్లి వన్ డే, టీ 20 ఫార్మాట్ల నుంచి తప్పుకున్నారు. మొన్నటి వరకూ విరాట్ కొహ్లి టెస్ట్ లకే కెప్టెన్సీ బాధ్యతలను వహిస్తున్నారు. ఈ సందర్భంగా తనకు అవకాశమిచ్చిన బీసీసీఐకి విరాట్ కొహ్లి కృతజ్ఞతలు తెలిపారు. తన సారథ్యంలో సాధించిన విజయాలను కూడా కొహ్లి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రత్యేకంగా రవిశాస్త్రి, ధోనికి కొహ్లి ధన్యవాదాలు తెలిపారు.


Tags:    

Similar News