Telangana : గవర్నర్ స్పీచ్ గాంధీభవన్ లో ప్రెస్ మీట్ లా ఉంది : కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెదవి విరిచారు;

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెదవి విరిచారు. గవర్నర్ స్పీచ్ గాంధీభవన్ లో ప్రెస్ మీట్ లా ఉందన్నారు. గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారన్నారు. గత పదిహేడు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్రంలో చేసిన నిర్వాకాన్ని ప్రజలు గమనించారని అన్నారు. గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారని కేటీఆర్ తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పదిహేడు నెలల కాలంలో...
గత పదిహేడు నెలల కాలంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారన్న ఆయన రైతులకు ఏం న్యాయం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. రైతు రుణమాఫీలో కూడా మోసం జరిగిందన్న కేటీఆర్ రైతు భరోసా నిధులు కూడా ఇంకా అందరికీ అందలేదన్నారు. ఏ నాణ్యమైన కరెంట్ ఇచ్చావని, రైతులు వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచారని చెప్పుకున్నారంటూ నిలదీశారు.