నేచర్ క్యూర్ హాస్పిటల్ కు రోశయ్య పేరు : రేవంత్ రెడ్డి
చర్లపల్లి రై్ల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరును పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు;

చర్లపల్లి రై్ల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరును పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో ఉన్న కొన్ని సంస్థలకు పేర్లను మారుస్తూ తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించేందుకేనని అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పేరు తొలగించినందున ఆయన పేరును చర్లపల్లి టెర్మినల్ కు పెట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు.
పొట్టి శ్రీరాములు పేరును...
అలాగే రోశయ్య పేరును బల్కంపేటలో ఉన్న ప్రకృతి చికిత్సాలయానికి కొణిజేటి రోశయ్య పేరును పెట్టాలని నిర్ణయించనట్లు తెలిపారు. రోశయ్య ను గౌరవించుకోవడం తమ కర్తవ్యమని,బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ కు విశిష్ట సేవలను అందించిన వీరిద్దరి పేర్లను పెట్టడానికి అనుమతివ్వాలంటూ రేవంత్ రెడ్డి స్పీకర్ ను కోరారు.