Telangana : నేడు రెండో రోజు తెలంగాణ సమావేశాలు
రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి;

రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. నిన్న బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 27 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. మధ్యలో సెలవులు ఉండటంతో పనిదినాల్లోనే సభ నడవనుంది.
19నబడ్జెట్...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 14న హోలీ, 16న ఆదివారం సెలవు కావడంతో జరగవు. ఈ నెల 19వ తేదీన ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత దానిపై చర్చ ఉంటుంది. దీంతో పాటు కొన్ని కీలక బిల్లులకు ఆమోదం తెలపనుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన బిల్లును ప్రభుత్వం ఆమోదించనుంది.