నేడు గవర్నర్ ప్రసంగంపై చర్చ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలుపుతూ చర్చ జరగనుంది.;

Update: 2023-02-04 02:12 GMT
నేడు గవర్నర్ ప్రసంగంపై చర్చ
  • whatsapp icon

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలుపుతూ చర్చ జరగనుంది. నిన్న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. గవర్నర్ ప్రసంగం ముగిశాక ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ నెల 6వ తేదీన తెలంగాణ బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టనున్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశ పెడతారు.

6న బడ్జెట్...
అలాగే శాసనమండలిలో రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈ నెల 8వ తేదీ నుంచి పద్దులపై చర్చ జరగనుంది. ఎన్నికల బడ్జెట్ కావడంతో బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో చర్చ జరిగే అవకాశముంది. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు విపక్షాలు రెడీగా ఉన్నాయి. దీంతో అధికార, విపక్షాలు ఎవరి వ్యూహాలతో వారు సభకు రానున్నారు.


Tags:    

Similar News