అప్పులు భారం కాదు... నిధుల సమీకరణే
అప్పులు చేయడం అంటే ఇప్పుడు భారం కాదని, నిధుల సమీకరణలో భాగమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు
అప్పులు చేయడం అంటే ఇప్పుడు భారం కాదని, నిధుల సమీకరణలో భాగమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం అప్పులను వనరుల సమీకరణ కింద పరిగణిస్తారని భావిస్తారన్నారు. మార్కెట్ బారోయింగ్స్ ను అప్పుగా చూడకూడదన్నారు. అప్పుల వల్ల వచ్చే ప్రమాదం ఏమీ ఉండదని కేసీఆర్ చెప్పారు. ఈరోజు బడ్జెట్ పై అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. వనరుల సమీకరణలోనూ కఠోరమైన క్రమశిక్షణను పాటిస్తున్నామని చెప్పారు.
అన్ని రంగాల్లో...
అప్పులు చేసే రాష్ట్రాల్లో తెలంగాణది 25వ ర్యాంకు అని కేసీఆర్ చెప్పారు. నిధులను సమీకకరించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. బడ్జెట్ అంటే బ్రహ్మపదార్ధమేమీ కాదన్నారు. నిధులను కూర్పు చేయడమే బడ్జెట్ లక్ష్యమని చెప్పారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. అవినీతిని అణిచివేసి పాలనలో పారదర్శకతను చేపట్టామని కేసీఆర్ చెప్పారు.
రాష్ట్రాలను బలహీన పరుస్తూ....
దేశంలో బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలుగు మారిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలతో రాష్ట్రాలను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తుందని చెప్పారు. కేంద్రం పనితీరు రాష్ట్రాలకన్నా దిగజారి పోయిందని చెప్పారు. ఈ పెడధోరణి కొనసాగితే దేశానికి నష్టమని చెప్పారు. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేక చర్యలను కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో కూడా రాష్ట్రాలతో సంబంధం లేకుండా పెత్తనం చేయాలని చూస్తుందన్నారు. కొన్ని పార్టీలు ప్రజల్లో విషబీజాలను నాటే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు