బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రిలీఫ్

ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైస్టే ఇచ్చింది.

Update: 2023-09-11 07:10 GMT

గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫడవిట్ లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని అభిప్రాయం పడిన హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. దీంతో అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ద్వితీయ స్థానంలో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది.

ప్రమాణస్వీకారానికి...
దీనికి సంబంధించి వెంటనే గజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి తెలిపింది. రాష్ట్ర ఎన్నికల అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లింది. డీకే అరుణ గద్వాల్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడానికి పలుమార్లు అసెంబ్లీకి వెళ్లినా అక్కడ స్పీకర్, కార్యాలయ సిబ్బంది లేకపోవడంతో వెనుదిరిగి వచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినప్పటికీ ఇక్కడ అధికారులు మాత్రం తనను ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయించడానికి ఏర్పాట్లు చేయలేదని డీకే అరుణ ఆరోపించారు.
స్టే ఇవ్వడంతో...
అయితే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయంచారు. ఆయన పిటీషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కూడా సుప్రీంకోర్టు కోరింది. ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడంతో గద్వాల్ ఎమ్మెల్యేగా కృష్ణమోహన్ రెడ్డి కొనసాగుతారని అసెంబ్లీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.


Tags:    

Similar News