విషాదం.. నీళ్ల బక్కెట్ లో పడి చిన్నారి మృతి

రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామానికి చెందిన ఎక్కల దేవీ లక్ష్మణ్, గీత దంపతులు మిషన్ కుడుతూ జీవనం..;

Update: 2023-07-18 08:48 GMT

తెలంగాణలోని జనగామ జిల్లా రఘునాథపల్లిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. 11 నెలల బాలుడు నీటి బక్కెట్ లో పడి ప్రాణాలు కోల్పోవడంతో వెల్ది గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామానికి చెందిన ఎక్కల దేవీ లక్ష్మణ్, గీత దంపతులు మిషన్ కుడుతూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులున్నారు. సోమవారం సాయంత్రం దంపతులిద్దరూ కుట్టుపనిలో నిమగ్నమై ఉండగా.. చిన్న కొడుకు హేమంత్ (11 నెలలు) పక్కనే ఆడుకుంటున్నాడు.

ఈ క్రమంలో నీళ్ల బకెట్ వద్దకు వెళ్లి.. ఆడుకుంటూనే అందులో పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించని తల్లిదండ్రులు హేమంత్ కోసం చుట్టుపక్కలంతా వెతికారు కానీ.. ఇంటి వద్దనున్న నీళ్ల బకెట్ ను గమనించలేదు. అంతా వెతికి తీరా చూస్తే.. హేమంత్ నీటి బకెట్ లో విగతజీవుడిగా కనిపించాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించాడని వైద్యులు ధృవీకరించారు. బోసినవ్వుల చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి, చిన్నారి మృతదేహాన్ని జనగామ ఆసుపత్రికి తరలించారు.


Tags:    

Similar News