Nagarjuna Vs KondaSurekha: కొండా సురేఖ లాయర్ చెప్పింది ఇదే!
తన కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ మంత్రి కొండా;
కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖపై పిటిషన్ దాఖలు చేసిన నటుడు అక్కినేని నాగార్జున మంగళవారం నాడు స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. నాగార్జునతో పాటు ఇద్దరు సాక్షులు యార్లగడ్డ సుప్రియ, వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది.
కొండా సురేఖ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేసినందుకు నాగార్జున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని, ఆయనపై కూడా తాము పరువునష్టం దావా వేస్తామని తెలిపారు. బీసీ మంత్రి కొండా సురేఖపై, ప్రభుత్వంపై బురదజల్లే ఉద్దేశంతో నాగార్జున పరువునష్టం దావా వేశారని సురేఖ తరపు న్యాయవాది ఆరోపించారు.