హైదరాబాద్ కి మరో కొత్త రైల్వే స్టేషన్..!!??

హైదరాబాద్ లో ఇప్పటికే మూడు రైల్వే స్టేషన్ లు వాడుకలో ఉన్నాయి..అవి సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ లు..

Update: 2024-09-15 07:40 GMT


హైదరాబాద్ లో ఇప్పటికే మూడు రైల్వే స్టేషన్ లు వాడుకలో ఉన్నాయి..అవి సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ లు..

వీటి ద్వారా దేశంలో ఎక్కడికైనా వెళ్ళి తిరిగి రావచ్చు... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సౌత్ లోనే అతిపెద్ద రైల్వే స్టేషన్...!! దేశంలోని ఎన్నో ప్రాంతాలనుండి ప్రజలు..ఈ స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు..!!

అయితే.. త్వరలోనే హైదరాబాద్ లో మరో రైల్వే స్టేషన్ ప్రారంభం కానుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు..!!

ఈ కొత్త రైల్వే స్టేషన్ ని చర్లపల్లి వద్ద...9 ప్లాట్ ఫారంలతో, రోజూ ఇక్కడ నుండి 50 రైళ్లు రాకపోకలు సాగించే విధంగా..415 కోట్ల రూపాయలతో ఈ చెర్లపల్లి స్టేషన్ ని ఆధునీకరించి నుంచున్నారు..

నాలుగు రోజుల క్రితం... కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇదే విషయమై సిఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు..!! అందులో...ఈ సరికొత్త రైల్వే స్టేషన్ పరిధిలో పార్కింగ్ మరియు రోడ్డు విస్తరణకు ప్రభుత్వం సహకరించాలని కోరారు..!!

దీనిపై వెంటనే స్పందించిన రేవంత్ రెడ్డి...

వివిధ ప్రాంతాల నుండి చెర్లపల్లి స్టేషన్ కి చేరుకునే రోడ్లను అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..!!

చెర్లపల్లి సమీపంలో ఉన్న అటవీ శాఖ భూములను మరియు పరిశ్రమ విభాగానికి సంబంధించిన భూములను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..!!

అక్కడ ఉన్న పరిశ్రమలను వేరే చోటుకు తరలించాలని సూచించారు..!!

అయితే అక్కడ ఉన్న ఇరుకు రోడ్డులో విస్తరణ పనులు మొదలు పెట్టాలంటే ప్రైవేటు ఆస్తులు వాడుకోవాల్సి ఉంటుందని, అక్కడి ప్రజలు ఎవరూ వాటిని ప్రభుత్వానికి ఇవ్వడానికి ముందుకు రావటం లేదని సమాధానం ఇచ్చారు... చూడాలి ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి ఎలా పరిష్కరిస్తారో..!!!

Tags:    

Similar News