Telanana Assembly : తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విన్నూత్న నిరసన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో ఉన్న బొమ్మలతో టీ షర్టులను వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. రేవంత్ - అదానీ ఒకటేఅంటూ నినాదాలు చేశారు. తెలంగాణ తల్లి మాదే అంటూ నినాదాలు చేస్తున్నారు.
టీ షర్టులతో రానివ్వమంటూ...
అయితే టీ షర్టులతో తాము అనుమతించబోమని సెక్యూరిటి సిబ్బంది అసెంబ్లీ గేటు వద్దనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులతో ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. స్పీకర్ కు వ్యతిరేకంగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. టీ షర్టులు తీసివేస్తేనే అసెంబ్లీలోపలకి అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది.