Telangana Assembly : ఆటోల్లో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు ఆటోలో వచ్చారు
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు ఆటోలో వచ్చారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి గన్ పార్క్ వరకూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఆటోలు వచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షలు ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
ఆటో కార్మికుల సమస్యలను...
ీప్లకార్డులు పట్టుకుని రావడంతో పోలీసులు అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఆటోల్లో వచ్చి అయితే సభలోకి ప్లకార్డులు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులతో ఎమ్మెల్యే వివేకానంద్ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.