భద్రాద్రి సీతారాముల కల్యాణం తలంబ్రాలు కావాలా?
భద్రాద్రి సీతారాముల కల్యాణం తలంబ్రాలు కావాలనుకునే వారికి భద్రాచలం దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది;

భద్రాద్రి సీతారాముల కల్యాణం తలంబ్రాలు కావాలనుకునే వారికి భద్రాచలం దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీరామ నవమి కల్యాణ ముత్యాల తలంబ్రాలను ఇంటింటికీ చేర్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాల భక్తులకు ఆన్‌లైన్‌లో ఈ నెల 30 నుంచి బుకింగ్స్ చేసుకోవచ్చని భద్రాద్రి ఆలయ ఈఓ రమాదేవి గురువారం ప్రకటించారు. ముత్యాల తలంబ్రాల ప్యాకెట్ ధర అరవై రూపాయలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పోస్టల్, ఆర్టీసీ కార్గోలో వేర్వేరు ప్యాకేజీలతో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
శ్రీరామనవమి సందర్భంగా...
ప్రతి నెల శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. అయితే ఎక్కువ మంది భక్తులు అక్కడకు చేరుకోలేరు. భక్తులు రద్దీతో అక్కడకు వెళ్లలేక టీవీలకే పరిమితం అవుతారు. సీతారామ కల్యాణంలో ఉపయోగించిన ముత్యాల తలంబ్రాలు పెళ్లిళ్లలో జరిపే తలంబ్రాలలో కలిపి నిర్వహించడం ఒక మంచి సంప్రదాయంగా భావిస్తారు. అందుకే భద్రాద్రి రామాలయం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అరవై రూపాయలకే ఇంటికే తలంబ్రాలను పంపే అవకాశాన్ని తెచ్చింది.