BJP : హైదరాబాద్ కు నేడు జేపీ నడ్డా
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు హైదరాబాద్ కు రానున్నారు.
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు హైదరాబాద్ కు రానున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగే సభలో ఆయన పాల్గొనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకుంటుండటంతో ఏడాది పాలనలో వైఫల్యాలపై బీజేపీ పోరు సభ జరగనుంది. ఈ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఆరు అబద్ధాలు, అరవై ఆరు మోసాలు అనే స్లోగన్ తో ఈ సభను ఏర్పాటు చేస్తుంది బీజేపీ.
ముఖ్య నేతలందరూ...
ఈ సభకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు , నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాజరు కానున్నారు. ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి జనసమీకరణ చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.