BJP : నేడు తెలంగాణలో బీజేపీ సత్యాగ్రహ దీక్షలు
తెలంగాణలో నేడు భారతీయ జనతా పార్టీ రైతు సత్యాగ్రహ దీక్షలు చేయనుంది;
తెలంగాణలో నేడు భారతీయ జనతా పార్టీ రైతు సత్యాగ్రహ దీక్షలు చేయనుంది. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు దీక్షలు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాన్ని ఎండగడుతూ ఈ దీక్షలు సాగనున్నాయి. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఈ దీక్షలను జరగనున్నాయి.
రైతు సమస్యలను...
రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ఎదుట రైతు సత్యాగ్రహ దీక్షలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు పదిహేను వేల భరోసా కింద నగదు చెల్లింపుతో పాటు, రైతు కూలీలలకు పన్నెండు వేలు, వరి క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్, రెండు లక్షల రైతు రుణ మాఫీ, పంట నష్టపరిహారాన్ని అందచేయాలని ఈ దీక్షలు చేయనున్నారు.