BJP : నేటి తెలంగాణ నుంచి బీజేపీ పోరుబాట

తెలంగాణలో నేటి నుంచి భారతీయ జనతా పార్టీ పోరుబాట చేపట్టనుంది.;

Update: 2024-11-30 02:42 GMT

తెలంగాణలో నేటి నుంచి భారతీయ జనతా పార్టీ పోరుబాట చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలగా విఫలమయినందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఈరోజు నుంచి డిసెంబరు ఐదో తేదీ వరకూ ఆందోళనలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీజేపీ ఛార్జిషీట్ విడుదల చేయనుంది. రేపు జిల్లా స్థాయిలో ఛార్జి షీట్ విడుదల చేస్తుంది.

ఇచ్చిన హామీలను అమలు చేయకుండా...
డిసెంబరు 2,3 తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలను నిర్వహిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలను మాత్రమే చేపడుతుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకోసమే నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బీజేుపీ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ కేంద్ర మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొనాలని పిలుపు నిచ్చింది.


Tags:    

Similar News