బండి సంజయ్ అరెస్ట్ పై హౌస్‌మోషన్ పిటీషన్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ లీగల్ సెల్ హైకోర్టును ఆశ్రయించింది;
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ లీగల్ సెల్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆ పార్టీ లీగల్ సెల్ హౌస్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. అర్ధరాత్రి ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయనపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, అందులో భాగంగానే అరెస్ట్ చేశారని పిటీషన్‌లో పేర్కొన్నారు.
లీకేజీ కేసులో...
టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ఉన్నారంటూ ఆయనను నిన్న అర్థరాత్రి కరీంనగర్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కుట్ర కేసు కూడా నమోదు చేయడంతో వెంటనే లీగల్ సెల్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.