నేడు జైలు నుంచి విడుదల

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి బెయిల్ లభించింది. కరీంనగర్‌ జైలులో ఉన్న సంజయ్‌కు బెయిల్ లభించింది

Update: 2023-04-07 02:14 GMT

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి బెయిల్ లభించింది. 14రోజుల రిమాండ్ ఖైదీగా కరీంనగర్‌ జైలులో ఉన్న సంజయ్‌కు బెయిల్ లభించింది. 20 వేల పూచీకత్తుతో పాటు ఇద్దరి జామీను కూడా సమర్పించాలని హన్మకొండ నాలుగో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఇన్‌ఛార్జి న్యాయమూర్తి రాపోలు అనిత తీర్పు నిచ్చారు. అయితే బెయిల్ ఇస్తూ కొన్ని షరతులు విధించారు. దేశం విడిచి వెళ్ల కూడదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, విచారణకు సహకరించాలని షరతులు పెట్టారు.

బెయిల్ లభించడంతో...
పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్‌ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ వాదనలు జరిగాయి. దాదాపు పది గంటల పాటు వాదనలను విన్న తర్వాత న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎనిమిది గంటల పాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రేపు ప్రధాని మోదీ పర్యటన ఉండటంతో బీజేపీ నేతలకు బండి సంజయ్‌కు బెయిల్ వస్తుందా? రాదా? అన్న టెన్షన్ పట్టుకుంది. అయితే చివరకు బెయిల్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదల కానున్నారు.


Tags:    

Similar News