బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట

బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పాదయాత్రకు హైకోర్టుకు అనుమతి ఇచ్చింది;

Update: 2022-11-28 07:19 GMT

బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పాదయాత్రకు హైకోర్టుకు అనుమతి ఇచ్చింది. అయితే షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. భైంసా పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో బహిరంగ సభను నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

షరతులతో కూడిన...
పాదయాత్ర భైంసా పట్టణంలోకి వెళ్లకుండా కొనసాగించాలని ఆదేశించింది. దీంతో భైంసా నుంచి బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నేడు ప్రారంభం కానుంది. పోలీసులు పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించారు. ఎవరినీ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయరాదని, బహిరంగ సభలో ఎలాంటి ఆయుధాలు ధరించ రాదని పేర్కొంది.


Tags:    

Similar News