కశ్మీర్ ఫైల్స్ తరహాలోనే ఓల్డ్ సిటీ ఫైల్స్
కశ్మీర్ ఫైల్స్ తరహాలోనే రజాకార్ల ఫైల్స్, ఓల్డ్ సిటీ ఫైల్స్ తీస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.;
కశ్మీర్ ఫైల్స్ తరహాలోనే రజాకార్ల ఫైల్స్, ఓల్డ్ సిటీ ఫైల్స్ తీస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ కేసీఆర్ సహకరించడం లేదని ఆరోపించారు. కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతుంటారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 105 సీట్లు కాదు పది సీట్లు కూడా రావని బండి సంజయ్ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని రాసిపెట్టుకోమని చెప్పారు.
ముందస్తుకు వెనక్కు తగ్గింది.....
మొన్నటి వరకూ ముందస్తు ఎన్నికలకు వెళతామని కేసీఆర్ భావించారని, కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో వెనక్కు తగ్గారని బండి సంజయ్ అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేసీఆర్ వద్ద సరైన విధానం లేదని చెప్పారు. ఢిల్లీకి వెళ్లి ఆందోళన చేస్తామనడం ఒక డ్రామా అని అన్నారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తామని కేసీఆర్ చెప్పింది వాస్తవమా? కాదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.