నేడు బండి సంజయ్ దీక్ష
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు నిరాహార దీక్షకు దిగనున్నారు.;
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు నిరాహార దీక్షకు దిగనున్నారు. ఈరోజు 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ పార్టీ కార్యాలయంలో దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలకు నిరసనగా దీక్ష చేపడుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా...
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, శాంతిభద్రతలు క్షీణించాయిని బండి సంజయ్ ఆరోపించారు. తనతో పాటు బీజేపీ కార్యకర్తలు, మహిళా మోర్చా నేతలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష చేసి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని కోరారు.