బండి సంజయ్‌ పిటీషన్‌పై నేడు విచారణ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిటిషన్ ఫై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది;

Update: 2023-04-10 04:19 GMT

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిటిషన్ ఫై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రిమాండ్ ను సవాలు చేస్తూ హైకోర్టు లో బీజేపీ లీగల్ సెల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. .ప్రభుత్వానికి, స్కూల్ హెడ్ మాస్టర్ కు హైకోర్టు నోటీసులు జారీ అయ్యాయి. బండి సంజయ్ పదో తరగతి ప్రశ్నాపత్రంలో లీకేజీ లో కుట్రదారుడు అన్నది తేలిందన్న అడ్వకేట్ జనరల్ వాదించారు.

ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో...
బండి సంజయ్ కి సంబందించిన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉన్నాయని ఏజీ కోర్టుకు తెలిపారు. అయితే ఇదంతా రాజకీయ కుట్ర అని బీజేపీ తరుపున న్యాయవాది రామచందర్ రావు వాదించారు. నేడు మరో సారి బండి సంజయ్ పిటిషన్ ఫై హైకోర్టు విచారణ చేపట్టనుంది.


Tags:    

Similar News