హైకోర్టులో బీఎల్ సంతోష్ కు ఊరట

తెలంగాణ హైకోర్టులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు ఊరట లభించింది. స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఇచ్చిన నోటీసులపై స్టే ఇచ్చింది;

Update: 2022-11-25 11:53 GMT

తెలంగాణ హైకోర్టులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు ఊరట లభించింది. స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఇచ్చిన నోటీసులపై స్టే మంజూరు చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీఎల్ సంతోష్ ను విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

ఫిర్యాదులో పేరు లేకున్నా....
ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేదని ఆయన తరుపున న్యాయవాది వాదంచారు. ఫిర్యాదులో ఆయన పేరు లేనప్పుడు ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు ఎలా చేరుస్తారని కోర్టు దృష్టికి బీఎల్ సంతోష్ తరుపున న్యాయవాది తీసుకువచ్చారు. దీంతో సిట్ విచారణపై స్టే మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబరు 5వ తేదీకి వాయిదా వేసింది.


Tags:    

Similar News