బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డికి ఊహించని చిక్కులు

పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్

Update: 2024-01-01 06:24 GMT

BRS leader kandala upender reddy banjara hills land case

పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ లో భూమిని ఆయన కబ్జా చేశారని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు పెట్టారు. షేక్ పేట తహసీల్దార్ అనితారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంజారాహిల్స్ రోడ్‌ నం.3లోని సర్వే నెంబర్ 8 లో 2.25 ఎకరాల భూమి ఉంది ఉంది. ఇందులో చాలా భాగం షౌకత్ నగర్ బస్తీగా ఏర్పడగా 2,185 చ.మీ. (ప్లాట్ నెంబర్ 8-సి) ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. సర్వే నెంబర్ లో (8-డి) షౌకతున్నీసా పేరుతో ఉన్న భూమిని ఉపేందర్ రెడ్డి గతంలోనే కొనుగోలు చేశారు. పక్కనే ఖాళీగా ఉన్న 2,185 చ.మీ. స్థలం కూడా తనదేనని చెబుతున్నారు. ఈ భూమిని ఆక్రమించుకోవడానికి గతంలో ఒకసారి ఉపేందర్ రెడ్డి ప్రయత్నించగా తహసీల్దార్ అడ్డుకున్నారు. ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని ల్యాండ్ బ్యాంక్ లోకి చేర్చారు. దీనిపై ఉపేందర్ రెడ్డికి చెందిన ‘దీప్తి అవెన్యూ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ కోర్టును ఆశ్రయించగా యథాతథస్థితిని కొనసాగించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉపేందర్ రెడ్డి ఈ భూమిని కబ్జా చేసి షెడ్లు నిర్మించి, వైన్ షాపు నిర్వహిస్తున్నారు.

తహసీల్దార్ అనితారెడ్డి బంజారాహిల్స్‌ పోలీసుల సహకారంతో శనివారం రాత్రి అక్కడికి చేరుకొని అక్రమ నిర్మాణాలన్నింటినీ సీజ్‌ చేశారు. భూకబ్జాపై అనితారెడ్డి ఫిర్యాదు చేయగా ఉపేందర్‌రెడ్డి తదితరులపై ఐపీసీ సెక్షన్లు 447, 427, 467, 468, 471; సెక్షన్‌ 3 ఆఫ్‌ పీడీపీపీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ప్రభుత్వ స్థలం కబ్జా చేశారన్న ఆరోపణలపై ఉపేందర్ రెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి బంజారాహిల్స్‌లో ప్రభుత్వ స్థలం ఆక్రమించారని షేక్ పేట్ తహశీల్దార్ అనితా రెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు.


Tags:    

Similar News