రాహుల్ కు కేటీఆర్ ప్రశ్న ఏంటంటే?
ఎక్స్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు
ఎక్స్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రియమైన @రాహుల్ గాంధీ జీ, ఇది ఎలాంటి వంచన? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. పార్లమెంట్‌లో అదానీ-మోడీ ఫోటో ఉన్న టీ షర్ట్ ధరించడం మీకు సరైనదే అయితే..మీ అడుగుజాడల్లో నడిచి తెలంగాణ అసెంబ్లీలో అదానీ-రేవంత్ వ్యవహారాన్ని బయటపెట్టడానికి మాకు ఎందుకు అనుమతి లేదని ఆయన ప్రశ్నించారు.
సమాధానం చెప్పాలని...
దయచేసి తమ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ కేటీఆర్ రాహుల్ గాంధీ కోరారు. ఏంటి ద్వంద్వ ప్రమాణాలు? అంటూ నిలదీశారు. నిన్న అసెంబ్లీకి అదానీ, రేవంత్ ఫొటోలతో టీ షర్టులు వేసుకుని వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోపలకి అనుమతించలేదు. వారిని అరెస్ట్ చేశారు. దీనిపైనే కేటీఆర్ రాహుల్ గాంధీని ప్రశ్నించారు.