Telangana : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పెద్దలతో సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి రానున్నారు;

Update: 2024-12-12 04:19 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి రానున్నారు. జైపూర్ లో ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి చేరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఆయన సమావేశమవుతారు. పార్టీ వ్యవహరాలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై ఏఐసీసీ నేతలతో చర్చించనున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముంది.



కేంద్ర మంత్రులను కలిసి...

కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు, ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇద్దరు కలసి కేంద్ర మంత్రులతో పాటు పార్టీ పెద్దలను కలవనున్నారు. అయితే మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి కూడా చర్చించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.



Tags:    

Similar News