Telanagana : తెలంగాణ అసెంబ్లీ 16వ కు వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడ్డాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాదరావు అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు ఉదయం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరు కాలేదు. రేవంత్ రెడ్డి, అదానీ టీ షర్టులను వేసుకుని రావడంతో వారిని అసెంబ్లీ గేటు బయటే అడ్డుకుని పోలీసులు వారిని అరెస్ట్ చేసి బయటకు పంపేశారు.
తొలి రోజు సమావేశాల్లో...
దీంతో తొలి రోజు సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రకటన చేశారు. దీనిపై స్వల్ప చర్చ జరిగింది. బీజేపీ, అధికార కాంగ్రెస్ అభ్యర్థులకు ఒకింత వాగ్వివాదం జరిగింది. అయితే సభను మాత్రం ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయించారు. తిరిగి వచ్చే సోమవారం శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.