హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట
సినీ నటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో ఊరట లభించింది.
సినీ నటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ముందు విచారణకు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. జరుగుతున్నది మోహన్‌బాబు కుటుంబ వ్యవహారంగా హైకోర్టు అభిప్రాయ పడింది. పోలీసులు మోహన్‌బాబు ఇంటి దగ్గర నిఘా పెట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రెండు గంటలకోసారి మోహన్‌బాబు ఇంటిని పర్యవేక్షించాలన్న హైకోర్టు తెలిపింది.
ఈ నెల 24వ తేదీకి వాయిదా...
తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈరోజు రాచకొండ కమిషన్ కు రావాలంటూ మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంచు మనోజ్ కమిషనర్ ఎదుట హాజరయ్యారు. అయితే మోహన్ బాబు మాత్రం తనను పోలీస్ కమిషనర్ నోటీసు లివ్వడంపై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు ఆయనకు ఊరట దక్కేలా తీర్పు చెప్పింది.