తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి జీవో నెంబరు 46 ను సవాల్ చేస్తూ కొందరు దాఖలు చేసిన పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మొత్తం 5,010 కానిస్టేబుల్ పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
జీవోను సవాల్ చేస్తూ...
ఈ జీవోను జారీ చేయడంపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా వారి వాదనలను తోసిపుచ్చింది. అయితే హైకోర్టు తీర్పునుసవాల్ చేస్తూ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓక, జస్టిస్ జార్జ్ మనీహ్ లతో కూడిన దర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.