Telangana : మూడు రోజులు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరివెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఆయన పర్యటించనున్నారు;
తెలంగాణ ముఖ్యమంత్రి నేడు ఢిల్లీకి బయలుదేరివెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఆయన పర్యటించనున్నారు. ఢిల్లీ, జైపూర్ లలో ఆయన పర్యటన ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 11, 12,13 తేదీల్లో ఆయనఢిల్లీ, జైపూర్ లో పర్యటిస్తారని తెలిపారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకుంటారు.అక్కడి నుంచి జైపూర్ కు వెళతారు.
కేంద్ర మంత్రులను కలసి....
అక్కడ ఒక బంధువు ఇంట్లో వివాహానికి హాజరవుతారు. తిరిగి రేపు సాయంత్రం ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలో రేపు కాంగ్రెస్ పెద్దలతో సమావేశమయ్యే అవకాశముంది. అలాగే ఎల్లుండి కూడా ఢిల్లీలోనే ఉండి కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారని చెబుతున్నారు.