KTR : చెత్త మాటలు మాట్లాడితే సీఎం అయినా సరే తాట తీస్తాం
తనకు ఫోన్ ట్యాపింగ్ తో ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.;
తనకు ఫోన్ ట్యాపింగ్ తో ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ చెత్త మాటలు మాట్లాాడితే సీఎం అయినా తాట తీస్తామని తెలిపారు. తన క్యారెక్టర్ ను తప్పుగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన క్యారెక్టర్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తనకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం లేదన్నారు.
ఫోన్ ట్యాపింగ్ తో...
తనకు ఇల్లీగల్ వ్యవహారాలతో సంబంధం లేదని ఆయన తెలిపారు. ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. దీనికి న్యాయపరంగానే ఎదుర్కొంటానని కేటీఆర్ తెలిపారు. ఎవరో హీరోయిన్లను తాను బెదరించారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి క్యారక్టర్ తనది కాదని కేటీఆర్ తెలిపారు. ఏదైనా సరే న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు.