తెలంగాణలో ఇక కఠిన ఆంక్షలు

తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు మాత్రమే కాకుండా ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి.;

Update: 2022-01-02 03:17 GMT

తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు మాత్రమే కాకుండా ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠిన తరం చేసింది. ప్రత్యేకంగా ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ నెల 10వ తేదీ వరకూ ర్యాలీలు, బహిరంగ సభలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. తెలంగాణ లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 10 వరకూ...
ఒమిక్రాన్ కేసులు ఇప్పటికే 79కు చేరుకున్నాయి. నిన్న ఒక్కరోజే 12 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సభలకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక దుకాణాలు, షాపింగ్ మాల్స్ లో కూడా భౌతిక దూరం పాటించాలని పేర్కొంది. మాస్క్ ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.


Tags:    

Similar News