Revanth Reddy : నేడు కూడా ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి.. టీఎస్‌పీఎస్సీ పరీక్షలపై?
సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీలో ఉన్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన దిశగా ఈరోజు యూపీఎస్సీ ఛైర్మన్ ను కలవనున్నారు
Revanth Reddy:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన దిశగా ఈరోజు చర్యలను ఆయన హస్తినలో ప్రారంభించారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు ఉన్నతాధికారులతో కలసి యూపీఎస్సీ ఛైర్మన్ ను కలవనున్నారు. పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై ఆయనతో చర్చించనున్నారు. పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల తయారీ, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై యూపీఎస్సీ ఛైర్మన్ తో చర్చించనున్నారు.
పకడ్బందీగా...
టీఎస్‌పీఎస్సీలో గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు లీకయి అభాసుపాలయిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ తో పాటు సభ్యులందరూ రాజీనామా చేశారు. అయితే గవర్నర్ దీనిని ఇంకా ఆమోదించాల్సి ఉంది. ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యులు ఎవరనేది ఇంకా తేలలేదు. అయితే కేరళలో పర్యటించిన తెలంగాణ ఐఏఎస్‌ల బృందం అక్కడి సర్వీస్ కమిషన్ పై అధ్యయనం చేసి వచ్చింది. దాని నివేదికను కూడా ఇవ్వాల్సి ఉంది.