Revanth Reddy : మండలిలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ శాసనమండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు;

తెలంగాణ శాసనమండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హాజరు శాతం పెరగాలంటే స్థానికసంస్థలలో పోటీ చేసే వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేలా తీసుకు రావాలని సభ్యులు చేసిన సూచనను ఆలోచిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థలో తమ ప్రభుత్వం వేగంగానిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.
విద్యావ్యవస్థ మీద...
శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ 2017లో రిక్రూట్ మెంట్ ఒక్కసారే జరిగిందన్నరేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా డీఎస్సీ నోటిఫికేషన్ లు ఇస్తున్నామని తెలిపారు. విద్యాకమిషన్ ఉంటే పర్యవేక్షణ బాగుంటుందని సూచించారని రేవంత్ రెడ్డి సూచించారు. టీచర్లు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలన్న నిబంధన పెడితే బాగుంటుందని మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి సూచించగా తనకు అందుకు అభ్యంతరం లేదని, అందరూ ఓకే అంటే చట్టం చేయడానికి తాను సిద్ధమని రేవంత్ రెడ్డి తెలిపారు.