మరో రెండు రోజులు వణికిపోక తప్పదు
తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ఱోగ్రతలు నమోదవుతున్నాయి
తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ఱోగ్రతలు నమోదవుతున్నాయి. మరో రెండు రోజుల పాటు తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు చలి మరింత పెరుగుతుందని హెచ్చరించింది. తూర్పు, ఈశాన్య దిశల నుంచి చలిగాలులు తెలంగాణ వైపు వీస్తున్నందునే చలి తీవ్రత పెరగడానికి కారణమని వాతావరణ శాఖ వెల్లడించింది.
రాత్రి ఉష్ణోగ్రతలు.....
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుందని సూచిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మరో రెండు రోజులు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.