SlBC Accident : ఆరుగురి మృతదేహాలు ఉన్నాయన్న చోట పరిస్థితి ఎలా ఉందంటే?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో ఆరు మృతదేహాల ఆచూకీ ఇంకా తెలియలేదు;

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో ఆరు మృతదేహాల ఆచూకీ ఇంకా తెలియలేదు. ప్రమాదం జరిగి 34వ రోజుకు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటికీ మృతదేహాల ఆచూకీ మాత్రం లభించడం లేదు.ఇప్పటి వరకూఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. గురప్రీత్ సింగ్, మనోజ్ కుమార్ మృతదేహాలు వారి బంధువులకు అప్పగించారు. ఆనవాళ్లు పట్టి వారిని గుర్తించి మృతదేహాన్ని అప్పగించడంతో పాటు మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని అందించారు. మృతదేహాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం వారి ప్రాంతాలకు చేరే వేసే బాధ్యతను భుజానకెత్తుకుంది. వారి సొంత గ్రామాలుకు ఆంబులెన్స్ లో పంపుతుంది.
నిరంతరం సహాయక చర్యలు...
అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైలం టన్నెల్ లో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. దాదాపు పన్నెండు బృందాలు నిరంతరం టన్నెల్ లో సహాయక చర్యలు చేపడుతున్నాయి. రోబోలతో తవ్వకాలను నిలిపేశారు. ప్రస్తుతం మినీ జేసీబీలతో డీ1, డీ2 ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అక్కడే మృతదేహాలు చిక్కుకుపోయి ఉన్నట్లు గుర్తించారు. నెల రోజులు దాటి పోవడంతో మట్టిలో లోతుకు కూరుకుపోయి ఉంటాయిని భావించి అందుకు అనుగుణంగా మినీ జేసీబీలతో తవ్వకాలు చేపడుతున్నా ఫలితం కనిపించడం లేదు. మరో ఆరు మృతదేహాల కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఇది ఎన్ని రోజులు నడుస్తుందన్నది తెలియకుండా ఉంది.
ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో...
టీబీఎం మిషన్ శిధిలాల తొలగింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. రెస్క్చూఆపరేషన్ కోసం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ ను ప్రత్యేక అధికారిగా నియమించింది. ఆయన దగ్గరుండి సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ కు యాభై మీటర్ల దూరంలోనే మృతదేహాలు ఉంటాయని భావించి ఈ మేరకు వారు తవ్వకాలు జరుపుతున్నారు. రోజుకు 650 మంది సహాయక సిబ్బంది నిరంతరం షిఫ్ట్ ల వారీగాపనిచేస్తున్నారు. నీరు పై నునుంచి ఉబికి వస్తున్నకారణంగా సహాయక చర్యలను వేగంగాచేపట్టలేకపోతున్నారు.సొరంగం కూడా ప్రమాదకరంగా మారడంతో అప్రమత్తంగా ఉండి రెస్క్కూ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నారు. మరి ఎండ్ కార్డు ఎప్పటికి పడుతుందో ఎవరికీ అర్థం కాకుండా ఉంది.