Telangana : నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. నేడు ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది;

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. నేడు ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బీసీ కులగణనతో పాటు ఎస్. సి రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను ఆమోదించింది. బీసీ కులగణనకు సంబంధించి తీర్మానం చేసి బీసీలకు 48 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తీర్మానం చేసి సభ కేంద్ర ప్రభుత్వానికి పంపింది.
నేడు డీ లిమిటేషన్ పై...
గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయిన ఉభయ సభలు నేటితో ముగియనుండటంతో నేడు అసెంబ్లీ ప్రారంభమయిన పది గంటత తర్వాత ఆర్ధిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క సభలో కాగ్ రిపోర్ట్ నను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం డీ లిమిటేషన్ పై తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. దీనిపై అన్ని పార్టీల నేతలు మాట్లాడనున్నారు.