evanth Reddy : కేటీఆర్ కు అసెంబ్లీలో రేవంత్ చురకలు
తాము కక్ష పూరిత రాజకీయాలు చేయట్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు;

తాము కక్ష పూరిత రాజకీయాలు చేయట్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలా చేస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు మొత్తం చర్లపల్లి జైల్లో ఉండేవారని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ అనుమతి లేకుండా డ్రోన్ ఎగుర వేస్తే ఎవరికైనా ఐదు వందల రూపాయల జరిమానా విధిస్తారని, కానీ గతంలో ఒక ఎంపీ మీద కేసు పెట్టి చర్లపల్లి జైల్లో వేశారని రేవంత్ రెడ్డి అన్నారు.
తన బిడ్డ పెళ్లికి కూడా...
తన బిడ్డ పెళ్లికి కూడా తాను మధ్యంతర బెయిల్ పై వచ్చి వెళ్లానని రేవంత్ రెడ్డి తెలిపారు. తాను ప్రతీకార రాజకీయాలు చేయదలచుకుంటే ఇప్పటికే చాలా మంది జైల్లో ఉండేవారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అక్రమ కేసులు పెట్టి వేధించే మనస్తత్వం తనది కాదని ఆయన తెలిపారు. కక్ష పూరిత రాజకీయాలు చేసింది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని అందరికీ తెలుసునన్న ఆయన పదేళ్ల పాటు రాష్ట్రంలో నియంత పాలన సాగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. అవేమీ తెలియనట్లు, ప్రజలు మర్చిపోయినట్లు మాట్లాడితే ఎలా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతును అణిచి వేసింది ఎవరో అందరికీ తెలుసు అని కేటీఆర్ కు రేవంత్ రెడ్డి చురకలు అంటించారు.