8న నస్పూర్ లో కాంగ్రెస్ బహిరంగ సభ
ఈ నెల 8న నస్పూర్ లో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది;
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలను నిర్వహిస్తుంది. ఒకవైపు నేతలు పాదయాత్రలు చేస్తూ పార్టీని జనంలోకి తీసుకెళుతున్నారు. తాజాగా ఈ నెల 8న నస్పూర్ లో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. బహిరంగ సభ జరిగే ప్రదేశానికి జై భారత్ సత్యాగ్రహ ప్రాంగణానికి మహాత్మాగాంధీ అని నామకరణం చేశారు.
లక్ష మంది...
బహిరంగ సభకు లక్షన్నరమంది మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావ్ చెబుతున్నారు. ఈ సభకు జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్ కీలకనేతలు.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ హాజరవుతారని తెలిపారు. సభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బీఆర్‌ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మూడో సారి అయినా తెలంగాణలో అధికారంలోకి రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా బహిరంగ సభలను అత్యధికంగా నిర్వహించాలని నిర్ణయించింది.