SLBC Accident : 33 రోజులవుతున్నా దొరికినవి రెండు మృతదేహాలే... మిగిలిన ఆరు?

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదంలో మరో మృతదేహాన్ని సహాయక బృందాలు వెలికి తీశాయి;

Update: 2025-03-26 03:34 GMT
rescue teams,  recover, dead body,  srisailam left canal tunnel
  • whatsapp icon

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదంలో మరో మృతదేహాన్ని సహాయక బృందాలు వెలికి తీశాయి. గత నెల 22వ తేదీన ప్రమాదం జరిగితే ఇపే్పటి వరకూ సప్రమాదంలో తప్పి పోయిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే 33 రోజుల నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటకీఇప్పటికి రెండు మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. గురుప్రీత్ సింగ్ మృతదేహం దొరికిన చాలా రోజులకు మరో మృతదేహం లభించింది. అది ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మనోజ్ కుమార్ దిగా గుర్తించారు. మనోజ్ కుమార్ ఇంజినీర్ గా పనిచేస్తూ ప్రమాదంలో చిక్కుకుని మరణించారని సహాయక బృందాలు వెల్లడించాయి. వారి బంధువులకు మృతదేహాన్ని అప్పగించనున్నారు.

దుర్వాసన రావడంతో...
లోకో రైలు డబ్బాల వద్ద దుర్వాసన రావడంతో అక్కడ మృతదేహం ఉన్నట్లు గుర్తించిన సహాయక బృందాలు అక్కడ తవ్వకాలు జరపడంతో మనోజ్ కుమార్ డెడ్ బాడీ బయటపడింది. ఇంకా ఆరు మృతదేహాల ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. ప్రధానంగా డీ1, డీ2 ప్రాంతాల్లో మృతదేహాలు ఉన్నట్లు సహాయక బృందాలు అక్కడే గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే బయటకు రాలేక ఎనిమిది మంది అక్కడే సజీవ సమాధి అయి ఉంటారని భావిస్తున్నారు. అయితే నెల రోజులకు పైగానే సమయం కావడంతో మృతదేహాలు కుళ్లిన పరిస్థితిల్లోకి వెళ్లిపోయాయి. మరో ఆరుగురివి కార్మికుల మృతదేహాలు.
ప్రభుత్వం మాత్రం...
అయితే ప్రభుత్వం మాత్రం సహాయక చర్యలను కొనసాగించాలని నిర్ణయించింది. ఆరు మృతదేహాలు లభ్యమయ్యేంత వరకూ రెస్క్యూ ఆపరేషన్లు ఆపవద్దని ఆదేశిచండంతో మొత్తం పన్నెండు బృందాలలో 650 మంది సిబ్బంది నిరంతరం సహాయక చర్యలు చేస్తూనే ఉన్నారు. ఒక దశలో సహాయక బృందాలకు కూడా విసుగు వచ్చింది. మృతదేహాలు దొరుకుతాయో? లేదో? అన్న అనుమానం బయలుదేరింది. కానీ నెల రోజుల తర్వాత మరో మృతదేహం లభ్యమవ్వడంతో ఆ ప్రాంతంలోనే తవ్వకాలు జరుపుతూ మిగిలిన మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాయి.



Tags:    

Similar News