Raja Singh : బీజేపీ నేతలే తనకు శత్రువులన్న రాజాసింగ్
గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు;

గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై గత ప్రభుత్వం పీడీ యాక్ట్ నమోదు చేసినప్పుడు తమ పార్టీకి చెందిన నేతలే పోలీసులకు కేసు పెట్టాలంటూ ప్రోత్సహించారని వ్యాఖ్యానించారు. తనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించే సమయంలో సొంత పార్టీ నేతలు, కొంతమంది బీజేపీ నేతలు పోలీసులకు మద్దతుగా నిలిచారన్న రాజాసింగ్ ఈ విషయాన్ని ఓ పోలీస్ అధికారే స్వయంగా తనతో చెప్పారని తెలిపారు
తన వెంట ఉన్నవారే...
కానీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తనను అరెస్ట్ చేసిన పోలీసు అధికారులను, బీజేపీ అధికారులను ఏం చేయాలని రాజాసింగ్ ప్రశ్నించారు. తమ పార్టీలోని నేతలే తనను వెన్నుపోటు పొడవాలని ఆలోచనలో ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైల్లో ఉన్న సమయంలో తన వెంట అన్న ఉన్నారు. మా కార్యకర్తలు నిలిబడ్డారని, ఈరోజు కూడా అన్నతన వెంటే ఉన్నారని అనుకుంటున్నా రాజాసింగ్ తెలిపారు.