మల్లారెడ్డి అడిగిన వెంటనే యాభై లక్షలు మంజూరు
మాజీ మంత్రి మల్లారెడ్డి అడిగిన వెంటనే ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పందించారు;

మాజీ మంత్రి మల్లారెడ్డి అడిగిన వెంటనే ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. తన నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఫ్లై ఓవర్ పనులను ప్రారంభించాలని మాజీ మంత్రి మల్లారెడ్డి అలా కోరిన వెంటనే, వినతి పత్రాన్ని సమర్పించిన వెంటనే తక్షణమే స్పందించిన భట్టి విక్రమార్క యాభై లక్షల రూపాయలు మంజూరు చేశారు.
ఫ్ల ఓవర్ పనులకు..
పథ్నాలుగు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఘట్‌కేసర్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఆయనను అసెంబ్లీ లోని కార్యాలయంలో కలిసిన మల్లారెడ్డి ఈ మేరకు విజ్ఞప్తి చేయగా వెంటనే స్పందించి పనులు ప్రారంభించేందుకు యాభై లక్షల నిధులు మంజూరు చేసిన భట్టి విక్రమార్కకు మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.