మునుగోడులో మంత్రిపై ఎన్నికల సంఘం ఆంక్షలు
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై ఆంక్షలు విధించింది.
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై ఆంక్షలు విధించింది. 48 గంటల పాటు ఎలాాంటి సభలు, సమావేశాలకు హాజరు కావడానికి వీలు లేదని పేర్కొంది. ఎలాంటి ప్రచారం చేయడానికి వీలు లేదని తెలిపింది. ఈ సాయంత్రం నుంచి ఆంక్షలు అమలులోకి వచ్చినట్లేనని పేర్కొంది.
వివరణ పట్ల...
ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. టీఆర్ఎస్ కు ఓటెయ్యకపోతే సంక్షేమ పథకాలు అందవని చెప్పారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు అందడంతో జగదీశ్వర్ రెడ్డిని వివరణ కోరింది. ఆయన వివరణ పట్ల సంతృప్తికరంగా లేకపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆంక్షలు విధించింది.