టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు

ఎమ్మెల్యే ఎర కేసులో కీలక వ్యక్తి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.;

Update: 2022-12-16 07:34 GMT

ఎమ్మెల్యే ఎర కేసులో కీలక వ్యక్తి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి రోహిత్ రెడ్డికి ఈ కేసులు జారీ అయినట్లు తెలుస్తోంది. 

మనీలాండరింగ్ కేసులో...
పైలట్ రోహిత్ రెడ్డి కి చెందిన మొయినాబాద్ లోని ఫాం హౌస్ లోనే ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు డీల్ జరిగింది. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. కొందరు బీజేపీ అగ్రనేతలకు కూడా స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రోహిత్ రెడ్డికి  ఈడీ నోటీసులు జారీ చేసిందన్న  విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 19న విచారణకు హాజరు కావాల్సిందిగా రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది.


Tags:    

Similar News