పైలట్ రోహిత్ రెడ్డి రిక్వెస్ట్‌కు ఈడీ నో
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రిక్వెస్ట్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తిరస్కరించినట్లు తెలిసింది.
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రిక్వెస్ట్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తిరస్కరించినట్లు తెలిసింది. తాను విచారణకు హాజరై మొత్తం డాక్యుమెంట్లు కావాలంటే విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని ఈడీని కోరారు. తన పీఏ ద్వారా ఆయన ఈడీ అధికారులకు లేఖ పంపారు.
మధ్యాహ్నం మూడు గంటలకు...
అయితే ఈడీ అధికారులు మాత్రం పైలట్ రోహిత్ రెడ్డి రిక్వెస్టను తిరస్కరించినట్లు చెబుతున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు హాజరు కావాల్సిందేనని పీఏకు చెప్పడంతో ఆ విషయాన్ని రోహిత్ రెడ్డికి తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు రోహిత్ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. 2017 నుంచి రోహిత్ రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీల గురించి ఈడీ అధికారులు విచారించనున్నారు.